Friday, August 30, 2019

కలబందతో అందమైన జుట్టు మీసొంతo

కలబంద (ఆలోవెరా) అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది. అది కూడా ఎక్కువ ఖరీదు లేకుండానే. ఆలోవెరా పోషకలాభాలు 75 యే ఉన్నా, ఈ మొక్కలో 100 కి పైగా సూక్ష్మపోషకాలున్నట్లు తేలింది. ఆలోవెరా మీ జుట్టుకి అసలు ఏం చేస్తుందని మీకు సందేహం రావచ్చు. ఇది మీ జుట్టుకి వాడదగిన అద్భుతమైన పదార్థాల్లో మేటిది. ఇది మరీ అతిశయోక్తిలా అన్పించచ్చు కానీ నిరూపించబడ్డ వాస్తవాలను మర్చిపోలేం.credit: third party image reference

కణాలను బాగు చేస్తాయి 1. ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగుచేస్తాయి. ఇలా కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి,త్వరగా జుట్టుపెరిగేలా చేస్తుంది. 2. ఆలోవెరాను జుట్టుకి రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా,మెత్తగా మారుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమౌతుంది, జుట్టును వదులుగా కూడా ఉంచుకోవచ్చు. 3. జుట్టు ఊడిపోవటం ఆపాలంటే,సహజంగా ఒత్తైన జుట్టు పెరగటానికి దీన్ని వాడండి. 4. ఆలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు మీ తల మాడుకి మంట,వాపు నుంచి ఉపశమనం ఇస్తాయి. 5. దీనిలోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును,పొట్టుగా ఊడిపోవటాన్ని నివారించి,నయం చేస్తుంది

6. ప్రొటియోలైటిక్ ఎంజైములతో పాటు, ఆలోవెరా (కలబంద)లో ఉండే ఎక్కువ ప్రొటీన్,విటమిన్లు, ఖనిజలవణాలు మీ జుట్టు కుదుళ్ళకి మంచి పోషణనిస్తాయి. 7. ఆలోవెరా మీ జుట్టును మంచిగా కండీషన్ చేసి, పోషకాలు,హైడ్రేషన్ స్థాయిలను నిలుపుతుంది. ఆలోవెరాలో మంచి విషయం ఏంటో తెలుసా? దీన్ని మీ ఇంట్లోనే వంటింట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. అలా రసాయనాలు కలుపుతారనే బెంగ ఉండదు. ఇంకా అందులో జుట్టుకి సంబంధించిన లాభాలు ఎన్నో దాగున్నాయి.

credit: third party image reference

ప్రాథమిక వాస్తవాలు తెలుసుకున్నాం కాబట్టి మీ హెయిర్ రొటీన్లో ఎలా ఆలోవెరాను వాడుకోవచ్చో తెలుసుకుందాం. మ్యాజిక్ ప్యాక్ సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె, ఆలోవెరాను కలపటం వలన మ్యాజిక్ ప్యాక్ తయారవుతుంది. ఇలా బలమైన,మృదువైన,ఒత్తైన జుట్టు వస్తుంది.వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను రాసుకుని ఎంతసేపైతే అంత వదిలేయండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకూ రాయండి. ముఖ్యంగా చివర్ల ఎక్కువగా రాయండి. ఎందుకంటే అక్కడే జుట్టు ఎక్కువగా పాడవుతుంది. సరిగ్గా తల అంతా పట్టించాక, షవర్ క్యాప్ పెట్టుకొని ఒక గంట అలా వదిలేశాక కడిగేయండి. ఈ అద్భుతమైన కండీషనింగ్ రెసిపి మీ జుట్టు ఆరోగ్యాన్ని తలపై తేమ పోకుండా చేసి కాపాడుతుంది.

credit: third party image reference

కవర్ పేజీ మోడల్స్ ను చూసినప్పుడల్లా వారి అందమైన, మెరిసే జుట్టును చూసి మీరు ఎన్నో సార్లు అసూయపడి ఉంటారు. మీ జుట్టుకి ప్రతిరోజూ కాలుష్యం,స్టైలింగ్ టూల్స్ ,ఉత్పత్తుల వచ్చే సమస్యలను చూసి ఎన్నిసార్లు చిరాకు పడివుంటారు? లేదా జుట్టు ఆరోగ్యంగా లేదని ఎన్నిసార్లు బాధపడివుంటారు? అయితే మీ జుట్టు సమస్యలు మొత్తం తీరిపోతాయి. కలబంద మీ చెంత ఉంటే అందమైన కురులు మీ సొంతం.



No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...