రామవరంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతడు జీవితంలో చాలా కష్టపడి పైకివచ్చాడు. తన ఎదుగుదలకు కారణం గురువు శ్రీనివాసశాస్తీ అని అందరితో చెప్పేవాడు. కృష్ణయ్య వృద్దుడయ్యాక తన కోడుకులిద్దరినీ పిలిచి గురువుగారి సలహాలతో హాయిగా బతకండని చెప్పాడు
credit: third party image reference
కృష్ణయ్య చనిపోయాక అతడి ఇద్దరు కొడుకులూ గురువు దగ్గరకు వెళ్లారు. ఆయన ఇద్దరికీ రెండు చీటీలిచ్చి.. ‘మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నపుడు మాత్రమే వీటిని తెరిచి చూడండి. వీటిలోని మంత్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి చీటీల్నివాళ్ళ చేతిలో పెట్టాడు. పెద్దవాడు తన వాటాగా వచ్చిన పొలం సాగుచేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చినపుడు, గురువు ఇచ్చిన చీటీ తెరిచి చూడాలని అనుకునేవాడు. కానీ అది ఒక్కసారికే ఉపయోగపడుతుందన్న మాట గుర్తొచ్చి ఆ ఆలోచన మానుకునేవాడు. సమస్యను తన శక్తిమేర పరిష్కరించుకునేవాడు.
credit: third party image reference
రెండోవాడు మాత్రం ఓసారి చిన్న సమస్యేదో రావడంతో గురువు ఇచ్చిన చీటీని తెరిచి చూశాడు. ‘నీది చాలా చిన్న సమస్య త్వరలోనే తీరిపోతుంది’ అని దాన్లో రాసుంది. ఆ మాటతో ధైర్యం తెచ్చుకున్నాడు. నెమ్మదిగా ఆ సమస్యనుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్లీమళ్లీ అతడికి సమస్యలు వచ్చాయి. వాటికి పరిష్కారం తెలియక నిత్యం ఇబ్బందిపడేవాడు.
పెద్దవాడు మాత్రం జీవితంలో ఎప్పుడూ చీటీ తెరవకుండానే అవసరమైతే చీటీ ఉందన్న ధీమాతో సమస్యలన్నీ తనకుతానుగా పరిష్కరించుకొంటూ సంతోషంగా జీవించాడు.credit: third party image reference